తిరుమల, ఫిబ్రవరి 26
తిరుపతికి చెందిన శ్రీ ఉదయకుమార్‌రెడ్డి అనే భక్తుడు శనివారం ఉదయం టిటిడికి రూ.17 లక్షలు విలువైన ఎంజి ఆస్టర్ కారును విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాత ఈ మేరకు కారు తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబుకు అందజేశారు.