కోరుట్ల సెప్టెంబర్ 29
ఏరైన
పుట్టినరోజు అనగానే కేకులు,క్యాండిల్ల వెలుగులు.. స్ప్రేల నురుగులు.. పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తూ జరుపుకుంటారు.కానీ కోరుట్ల మండలం అయిలాపూర్ నిమిషకవి నవీన్-దివ్వల కుమారుడు రిష్వంత్ జన్మదినం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు లోబడి శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సరస్వతి దేవి సమక్షంలో తల్లిదండ్రుల,గురువుల ఆశీర్దంతో బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిమిషకవి నవీన్ దివ్య దంపతుల కుమారుడు రిష్వంత్ జన్మదినం పురస్కరించుకుని పాఠశాల అభివృద్ధికి 20 వేల రూపాయల విరాళం అందజేశారు.ఈ సందర్భంగా నిమిషకవి నవీన్ మాట్లాడుతూ అనవసరమైన ఖర్చులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే కన్నా,పది మందికి ఉపయోగ పడే పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి పొందుతుందని అన్నారు.అనంతరం నవీన్ దివ్య దంపతులను పాఠశాల యాజమాన్యం సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇందూరి సత్యం,కౌన్సిలర్ మాడవేని నరేష్, నాయకులు గిన్నెల శ్రీకాంత్,ప్రముఖ విద్యావేత్త పోతని ప్రవీణ్ కుమార్, సీనియర్ జర్నలిస్టు నాయకులు శికారి రామకృష్ణ,కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, పాత్రికేయులు గజం శంకర్,ప్రధానాచార్యులు నితిన్ కుమార్, ప్రవీణ్, కోశాధికారి నీలి శ్రీనివాస్, శ్రీరాముల శ్రీనివాస్,నిమికవి సురేష్ తదితరులు పాల్గొన్నారు..