Home ఆంధ్రప్రదేశ్ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం

277
0

తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 16,
అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న  రవి ఐకా తరఫున  ప్రతినిధి  విజయవాడకు చెందిన  రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ   రవి ఐకా ఇప్పటికే టిటిడికి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ  సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Previous article42 రోజుల పాటు 3516 మంది కార్యకర్తల కుటుంబాలతో భేటీ
Next articleసచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here