Home తెలంగాణ హైదరాబాద్ అభివృద్దికి రూ. 5వేల కోట్ల మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ అభివృద్దికి రూ. 5వేల కోట్ల మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి

101
0

హైదరాబాద్, సెప్టెంబర్ 24
హైదరాబాద్ అభివృద్దికి 5వేల కోట్లకు పైగా జిహెచ్ఎంసికి నిధులు కేటాయించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, మున్సిపల్ & IT శాఖ మంత్రి వర్యులు కె.టి.ఆర్ గారికి జిహెచ్ఎంసి ప్రజల, ప్రజాప్రతినిధుల తరఫున నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో ఏర్పాటు సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరానికి రానున్న 15 ఏళ్ల ప్రజల పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ. 3866 కోట్లు, రూ.1200 కోట్లు మురుగునీటి శుద్దీకరణ, మంచినీటి అవసరాల కొరకు మంజూరు చేయడం సంతోషించదగ్గవిషయం అన్నారు. హైదరాబాద్ ప్రజలు అన్ని పార్టీల కార్పొరేటర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలియజేశారు. హైదరాబాద్ శివారు నగర ప్రాంతంలో కూడా త్రాగునీరు అందించేందుకు రూ. 1200 కోట్లను మంజూరు చేయడం సాహసోపేత నిర్ణయంగా భావిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం 25 సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా 772 ఎంఎల్డీ  ముగురునీరు శుద్ది ప్రస్తుతం దాదాపు 46.78 శాతం మాత్రమే ఉందని, కానీ మొత్తం మురుగునీటి శుధ్ది 1650 ఎంఎల్డీ  మిగతా 878 ఎంఎల్డీ లకు గాను రానున్న 15 ఏళ్ల ప్రజా అవసరాల దృష్ట్యా…100% సీవేజ్ ట్రీట్మంట్  గాను రూ. 3866.21 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ యొక్క 31 సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా హైదరాబాద్ నగరం అన్ని మెట్రో నగరాలలో మందు భాగాన ఉంటుందని తెలియజేశారు.  ఒక్కరోజులోనే రూ. 5 వేల కోట్లు మంజూరు చేయడం, G.O లు కూడా వెంటనే జారీచేయడం చరిత్రలో మొదటిసారి, ఈ యొక్క చరిత్ర కేవలం కేసీఆర్   ప్రభుత్వంలోనే నిరూపితమయింది.  2 లక్షల మంచినీటి కొత్త కనెక్షన్లను కూడా రెండు సంవత్సరాల్లో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.  చరిత్రను సృష్టించాలన్నాతిరగరాయాలన్నా కేవలం మన కేసీఆర్ ముఖ్యమంత్రి తోనే, యువ నాయకులు కేటీఆర్  స్ఫూర్తితో మేమందరం కోసం చిత్తశుద్దితో అంకితభావంతో పనిచేస్తామని తెలియజేశారు.

Previous articleగుజ‌రాత్ అసెంబ్లీ తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా నీమాబెన్ ఆచార్య‌!
Next articleతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్యెల్యేలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here