తిరుపతి
తిరుపతి అబ్బన్న కాలనీలో
ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు ఇంట్లో చేరి…ఆపై విద్యుత్ షాక్ కి
గురై మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు మృతుడు రిషీ గౌతమ్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం 5 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ దూది కుమారి, తహసీల్దార్ రమణ పాల్గొన్నారు.