Home తెలంగాణ గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులు

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులు

103
0

హైద‌రాబాద్  సెప్టెంబర్ 18
ఈ నెల 19న గ్రేటర్‌లో జరుగనున్న గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటించారు. గణేశ్‌ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు.ఆర్టీసీలో ప్రయాణం చేసే భక్తులకు ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు ఇద్దరు అధికారులను నియమించనున్నారు. జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద మరో ఎనిమిది మంది అధికారులను ఏర్పాటు చేశామన్నారు. రిలీవ్‌ వ్యాన్లు మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Previous articleహుజూరాబాద్ లో తెరాస గెలుపు ఖాయం మంత్రి కేటీఆర్
Next articleటీటీడీ ఛైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే రోజా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here