కోరుట్ల అక్టోబర్ 23
అక్టోబర్ 25 తేది నుండి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న నైపథ్యంలో కోరుట్ల పరిసర ప్రాంతాల విద్యార్థులకు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా కోరుట్ల ఆర్టీసీ డిపో
బస్సు సౌకార్యం కల్పంచాలని కోరుతూ శనివారం స్థానిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు
వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి చిప్ప మహంత్ మాట్లాడుతూ, కోరుట్ల లోని పరిసర పల్లె ప్రాంతాలలో తక్కువ బస్సుల సౌకర్యం కారణంగా, బస్సుల ఆలస్యం మరియు నిర్దేశిత సమయం లేక పోవడం వల్ల ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తూన్నారు. కావున, పరీక్ష సమయంలో విద్యార్థులకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అనుమతించరనే విషయం దృష్టిలో పెట్టుకొని, పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకునేలా ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని,ప్రస్తుతం
తక్కువ బస్సుల రవాణా కారణంగా కొన్ని ప్రాంతాల ప్రజలు ఆటో, జీబు, సొంత వాహనాల ద్వారా పరీక్షా కేంద్రాల్లో వస్తున్నారని గుర్తించి,ఆర్టీసీ ద్వారా సేవలు అందించాలని కొరారు. అలాగే బస్సు స్టాపుల వద్ద, బస్సు నిర్దేశిత సమయం ప్రజలకు తెలిసేలా బోర్డులు
ఏర్పాట్లు చేయాలని కొరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ రాహుల్, కృష్ణ చైతన్య, టౌన్ ఈసీ మెంబర్
అజయ్, వాసు, శివ, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు