నంద్యాల
నంద్యాల పట్టణంలోని నూనెపల్లె సర్కిల్ వద్ద గురువారం నాడు వామపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు.
నేడు రవాణా సౌకర్యం పెరగడంతో ఎక్కడికైనా సులువుగా వెళ్ళే అవకాశం ఏర్పడింది. వామపక్ష నాయకులు మాట్లాడుతూ దాదాపు ప్రతి ఇంటిలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి . ఏ చిన్న పని కోసమైనా ద్విచక్రవాహనం వినియోగించడం పరిపాటిగా మారింది . పేద , మధ్య తరగతి ప్రజలు ఉద్యోగ , ఉపాధి నిమిత్తం ఆటోలపై ఆధారపడుతున్నాయి . రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు రవాణా రంగంతో పాటు జిల్ పెట్రోల్ ధరలు నానాటికీ పైకి ఎగబాగుతున్నాయి . సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి . ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి . కరోనాతో సగటు జీవి ఆర్థిక పరిస్థితి కకావికలమైంది . ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇంధన భారం నడ్డి విరుస్తోంది . రవాణా వ్యయం పెరగడం వలన సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి . వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా అమాంతం పెరుగుతోంది . ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ .115.చేరువలో , డీజిల్ రూ 105 దగ్గర లో ఉంది . పరుగులెత్తుతున్న పెట్రో ధరలతో సామాన్య , మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు . వెరసి పేద , మధ్యతరగతి వారు బతకడం కష్టంగా మారుతోంది . ఆగని పెట్రో పరుగులు . డీజిల్ పరుగులు. సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది . ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు , ట్రాన్స్ పోర్టు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది . పేద ప్రజలు శుభకార్యాలకు , ఆపద సమయంలో ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది . కార్ల ప్రయాణం మరింత భారంగా మారింది . ఇతర వాహనాలను అద్దెకు తీసుకోవడం భారంగా మారింది . సామాన్యులు బండి బయటకు తీయాలంటేనే భయపడాల్సిన • అన్ని రంగాలపై ప్రభావం పెరిగిన రవాణా చార్జీలు గతి తప్పిన సామాన్య జీవనస్థితి దయనీయంగా మారింది అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి తగిన న్యాయం చేయాలని కోరుతూన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బాబ ఫక్రుద్దీన్. పట్టణ కార్యదర్శి కె ప్రసాద్. సీపియం నాయకులు సీ.పి.ఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ పరుగులు తీసుకున్న పెట్రోల్ డీజిల్ గతి తప్పిన సామాన్య జీవనస్థితి ప్రభుత్వాలు కనిక...