Home నగరం ఎస్ ఒరిజినల్స్, ఆర్‌కే సినీ టాకీస్ ‘మధుర వైన్స్’ సినిమా నుంచి వెన్నెల క‌న్నెల రేయి...

ఎస్ ఒరిజినల్స్, ఆర్‌కే సినీ టాకీస్ ‘మధుర వైన్స్’ సినిమా నుంచి వెన్నెల క‌న్నెల రేయి సాంగ్ కి సూప‌ర్ రెస్పాన్స్‌

97
0

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్. మంచి చిత్రాలుగా గుర్తింపు పొందిన‌  గతం, తిమ్మరుసు లాంటి  చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ అధినేత సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో  ఇండస్ట్రీ మ‌రియు ట్రేడ్ లో  ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. ఇప్ప‌టికే ఆడియ‌న్స్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సంభందించి వెన్నెల క‌న్నెల రేయి అనే సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మ‌ద్య‌లో వ‌చ్చే డైలాగ్స్ యూత్ ని ఆక‌ట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్న ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తు్న్నారు.
ఈ సంద‌ర్బంగా ఎస్ ఒరిజిన‌ల్స్ అధినేత సృజన్ యారబోలు మాట్లాడుతూ..  మా బ్యాన‌ర్
ఎస్ ఒరిజనల్స్ నుంచి త్వ‌ర‌లో అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి.. మధుర వైన్స్ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది, ఈ సినిమా ద్వారా చాలా మంచి ప్రేమ ని సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూపించ‌బోతున్నాం. హీరొ హీరోయిన్ మద్య‌లో జ‌రిగే స‌న్నివేశాలు యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమా నుండి ఇప్ప‌డు విడుద‌ల చేసిని సాంగ్ చూస్తే అంద‌రికి అర్ధ‌మ‌వుతుంది, ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో చాలా బాగా వెలుతుంది. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం అందించారు.  వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమా విడుద‌ల‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు . అని అన్నారు
నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు

Previous articleమంగళవారం నుంచి మావోయిస్టు ఆవిర్భావవారోత్సవాలు ఆడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు
Next articleచాగలమర్రిలో అక్బర్ భాష కుటుంబం ఆత్మహత్యాయత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here