Home జాతీయ వార్తలు సోమవారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

సోమవారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

282
0

కోచి
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈనెల 15 నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. సోమవారం(నవంబర్ 15) నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. మండల మకర విళక్కు పండగ సందర్భంగా భక్తులు సందర్శించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ 15న సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో గర్భగుడిని తెరువనున్నారు. ఈ నెల 16 నుంచి భక్తుల ధర్శనానికి అనుమతి ఇస్తారు.  డిసెంబర్ 26న మండల పూజ ముగింపు. . మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.  అదే నెల 20 వ తారీఖున ఆలయం మూసివేస్తారు.
శబరిమలకు వచ్చే వారికి కేరళ రాష్ట్ర  ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకుని.. 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారినే శబరిమలకు అనుమతిస్తారు. దర్శనానికి వెళ్లే వారు తప్పకుండా  తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. యాత్రలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ఇక పంపానదిలో స్నానానికి అనుమతి ఉంటుంది. అయితే,  బస చేసేందుకు మాత్రం అనుమతి లేదు
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అనుమతి లేదు. వాహనాలను కూడా నీలక్కల్ వరకు మాత్రమే అనుమతిస్తారు.  అక్కడ నుంచి ప్రభుత్వ బస్సులు ఇతర వాహనాలు పంబ వరకు వెళ్లాలి. రోజుకు 30 వేల మందిని దర్శనం కోసం అనుమతిస్తారు.

Previous articleకుసుమలు, అముదాల సాగుపై దృష్టి సారించాలి మంత్రి నిరంజన్ రెడ్డి
Next articleసఖి సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ రవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here