Home తెలంగాణ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సాగర పరిక్రమ

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సాగర పరిక్రమ

102
0

హైదరాబాద్
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం  ఉదయం “సాగర పరిక్రమ” పేరుతో ట్యాంక్ బండ్ చుట్టూ ద్విచక్ర వాహనాలతో బారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్షులు . రాఘవరెడ్డి  నేతృత్వంలో వందలాది గణేష్ భక్తులు దేశభక్తి- దైవభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాఘవరెడ్డి  మాట్లాడుతూ “19 సెప్టెంబర్ రోజున ట్యాంక్ బండ్ తో పాటు నగరం చుట్టూ ఉన్న చెఱువులలో ఘనంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కొన్ని హిందూ వ్యతిరేఖ శక్తులు కాలుష్యం పేరుతో ఉత్సవాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గణేష్ ఉత్సవాల కారణంగా ఎలాంటి జల కాలుష్యం జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం చెఱువుల కాలుష్యం మరియు అన్యాక్రాంతం పై శ్వేత పత్రం విడుదల చేయాలని”డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శులు రావినూతల శశిధర్, కౌడి మహేందర్ , కేంద్ర కమిటి సభ్యులు ఆలె బాస్కర్, రూప్ రాజ్, జస్మత్ పటేల్ లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది పాల్గొన్నారు.

Previous articleకేంద్రమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ
Next articleవైభవంగా శ్రీగుంటి రంగస్వామి రథోత్సవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here