విశాఖపట్నం
అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం డముకు వారపు సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువుదోపిడి ని తక్షణమే సంబంధిత అధికారులు అరికట్టాలని జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దూరియా సన్యాసిరావు, గెమ్మెల ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. దముకు బుధవారం సంతలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి, నకిలీ వస్తువులను పరిశీలిస్తూ, ఇకపైన ఇటువంటివి నకిలీ వస్తువులు గిరిజనులకు అమ్మితే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తామని వ్యాపారస్తులు తో సూచించారు, అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా సన్యాసి రావు మాట్లాడుతూ వారపు సంతల్లో గిరిజనులకు నిలువు దోపిడి చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, ఇష్టారాజ్యంగా వ్యాపారస్తులు నిలువు దోపిడీ చేయడం అలవాటుగా మారిపోయిందని, వారపు సంతల్లో గిరిజనులు పండించిన పంటకు కారుచౌకగా మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని, ఒకపక్క తూకంలో మోసం చేస్తున్నారని వారపు సంతల్లో నకిలీ వస్తువుల ఖైని గుట్కా జోరుగా మరింత పెరుగు పోతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు మరి అంత నిలువుదోపిడి గురవుతున్నారని దీనిపై ప్రభుత్వం ఒక కన్నేసి సంత లో జరుగుతున్న అక్రమ నిలువుదోపిడీ అరికట్టాలని, గిరిజనుల పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేసారు. అనంతరం సంతలో నిలువు దోపిడీ అరికట్టాలని ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసైనికులు పండు జీవన్ రాజు తదితరులు పాల్గొన్నారు.