Home తెలంగాణ సంజయ్, రేవంత్ లు చడ్డీ గ్యాంగ్‌లుగా తయారైనారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

సంజయ్, రేవంత్ లు చడ్డీ గ్యాంగ్‌లుగా తయారైనారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

139
0

నల్లగొండ అక్టోబర్ 4
బీజేపీ నేత బండి సంజయ్, కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డిలు రాష్ట్రము లో చడ్డీ గ్యాంగ్‌లుగా తయారైనారని,వారి తీరు తీరు చడ్డీ గ్యాంగ్‌ల‌ను తలపిస్తుందని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే దారి దోపిడీలు ఖాయమన్నారు. రైతులు చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తుంద‌న్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నిన్న న‌లుగురు రైతులు మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌న్నారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఇక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగా నీతులు మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారనారు.బీజేపీకి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని అన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పారు. విద్య, వైద్యంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింద‌న్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా, చల్లగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్, కేటీఆర్ ల మీద బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాల‌ని సూచించారు. కేవలం అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు పట్టవని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చమురు ధరలను పెంచుతూ బీజేపీ పార్టీ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటుంద‌ని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

Previous articleవార‌స‌త్వ క‌ట్ట‌డాల‌ ప‌రిర‌క్షనకు చ‌ర్య‌లు – మంత్రి శ్రీనివాస్ గౌడ్
Next articleరైతుల కాల్పుల ఘటనలో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కుమారుడి పై మ‌ర్డ‌ర్ కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here