నెల్లూరు
నెల్లూరు జిల్లా,చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని మండల వైకాపా మండల కన్వీనర్ సన్నా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కైవసం చేసుకోవడం తో ఎంపీపి ఎన్నిక వివాదానికి ఎట్టికేలకు తెరపడింది.జిల్లాలోనే చిట్టమూరు ఎంపిపి అధ్యక్ష పీఠం వైసీపీ అధిష్టానంకు తలనొప్పిగా మారింది. వైకాపా అధిష్టానం వైసీపీ నేత దువ్వూరు శేషురెడ్డి కి బి ఫామ్ ఇవ్వడం, మెజారిటీ ఎంపిటిసి స్థానాలు సన్నారెడ్డి వైపు ఉండంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.మండలంలో ఒకే పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పొరుతో 2 పర్యాయాలు ఎంపిపి ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. దింతో మండలం ఉత్కంఠగా ఎంపిపి అధ్యక్ష పీఠం పోరు నిలిచింది. అయితే ఎట్టకేలకు జరిగిన పోరులో అధిష్టానం సన్నా రెడ్డి వైపు మొగ్గు చూపి మరలా బి ఫారం సన్నా రెడ్డి చేతికి రావడంతో, వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తల్లి సన్నారెడ్డి విజయలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు.
చిట్టమూరు మండలంలో వైకాపాకు చెందిన 11మంది ఎంపిటిసిలు విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైఎస్ ఎంపీపీగా బి .వి. రమణయ్య, కో ఆప్షన్ సభ్యునిగా మస్తాన్ సాహెబ్ ను ఎన్నుకున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేరిగ మురళీధర్ నూతనకమిటీకిశుభాకాంక్షలను తెలియజేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన వైకాపా నాయకులు, సన్నారెడ్డి కుటుంబ అభిమానులు సమక్షంలో శ్రీనివాసులురెడ్డి కి సత్కారాన్ని అందించారు. అభిమానులు శ్రీనివాసులురెడ్డిని తమ భుజాలపై మోసుకుంటు తమ అభిమానాన్నిచాటుకున్నారు.ఈ సందర్భంగా మేరిగా మురళీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలోని నాయకుల మధ్య చిన్న, చిన్న అపార్థాలు చోటు చేసుకున్నప్పటికి పార్టీ అధిష్టానం సూచనల మేరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు. పార్టీలోని తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకునే హక్కు ఉందన్నారు. అలాంటి సమయాల్లో వివాదాలుచోటు చేసుకోవచని అయినప్పయికి పార్టీ నిర్ణయాలన్ని శిరసావహించడం జరుగుతుందన్నారు.
ఇది ఇలా ఉంటే సన్నా రెడ్డి మొదటి నుండి వైసీపీ కోసం అహర్నిశలు శ్రమించారు. వైకాపా మండల కన్వీనర్ గా పనిచేస్తూ ,మండలంలో వైసీపీని బలోపేతం చేసేందుకు ఆయన ఎనలేని సేవలు చేశారు. పార్టీ కోసం కష్ట కాలంలో పనిచేసి స్థానిక పరిషత్ ఎన్నికల్లో 11 స్థానాల్లో 8 సన్నా రెడ్డి వర్గం కైవసం చేసుకోవడం ద్వారా న్యాయ బద్దంగా ఎంపిపి పదవీ తమకు రావాలి అనీ సన్నా రెడ్డి ఎనలేని రాజీలేని పోరాటం చేశారు. పట్టు వదలని విక్రమార్క్ గా సన్నా రెడ్డి నిలిచారు. సన్నా రెడ్డి పక్షాన మొదటి నుండి మేరిగా మురళీధర్ నిలవడం విశేషం. ఎంపిపి అధ్యక్ష ఎన్నికకు ఎమ్మెల్యే వెలగపల్లి రాకపోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Home ఆంధ్రప్రదేశ్ చిట్టమూరు ఎంపీపీ పీఠం ను కైవసం చేసుకున్న సన్నా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి చిట్టమూరు...