రంపచోడవరం
రంపచోడవరం తాసిల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ గా విధులు నిర్వహిస్తున్న వీరబ్రహ్మం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రంపచోడవరం సిరిగిందల పాడుకు చెందిన గూడెం రాంబాబు తన పట్టాదారు పాసు పుస్తకం పేరు మార్పు కొసం వీరబ్రహ్యంను చాలాసార్లు సంప్రదించాడు. పదివేల రూపాయలు ఇస్తే గాని పనిచేయని ఆర్ఐ చెప్పడంతో బాధితుడు గూడెం రాంబాబు రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ వారికి పిర్యాదు చేసాడు. మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో రంపచోడవరం తాసిల్దార్ కార్యాలయం పై రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడి చెయ్యగా ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఆర్. ఐ వీరబ్రహ్మం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు