నెల్లూరు
ఒక యువతిని చితకబాదుతున్న వీడియోలోని వ్యక్తిని బుధవారం ఉదయం పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. సదరు వీడియో రెండు నెలల క్రితం కోత్తూరు ప్రాంతంలో చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పల్లాల వెంకటేష్ రామకోటయ్యనగర్ వాసిగా గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్ కి బాధితురాలు కు గతంలో పరిచయంవుంది. ఇటీవల ఆ యువతికి పెళ్లయింది. బాధితురాలికి మరో వ్యక్తితో అక్ర సంబంధం వుందన్న అనుమానంతో వెంకటేష్ దాడికి దిగాడని పోలీసులు తెలిపారు. ఘటనలో బాధితురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటననువీడియో తీయడానికి వెంకటేష్ స్నేహితులుకోటారి శివ, కొమరిక మనోహర్ లు సహకరించారు. శివాను కుడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని గుర్తించి ఆమెతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.