Home ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అచ్చెన్నాయుడు తీరుపై సీం జగన్‌ ఆగ్రహం

శాసనసభలో అచ్చెన్నాయుడు తీరుపై సీం జగన్‌ ఆగ్రహం

370
0

అమరావతి మార్చ్ 7
ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం పట్ల ఏపీ సీం జగన్‌ టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సభలో టీడీపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు. వయసులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ’ జగన్‌ పేర్కొన్నారు.ఈరోజు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌..గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బడ్జెట్‌ ప్రతులను చింపివేశారు. సమావేశం నుంచి వాకౌట్‌ చేసి లాబీలో నిరసనలు తెలిపారు.

Previous articleటీడీపీ వారికి ఆవేశం ఎక్కువ.. మంత్రి బొత్స సత్యనారాయణ
Next articleతెలంగాణ సర్కారులో మహిళారంగానికి పెద్దపీట -మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు -మహిళా సంక్షేమానికి గొప్ప పథకాల అమలు -పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here