జగిత్యాల, సెప్టెంబర్ 20
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కు అందిస్తున్న ఆసరా పెన్షన్లపై ఎందరో ఆధారపడి ఉన్నారని ప్రతినెలా పెన్షన్ సాకాలంలో వచ్చేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఇచ్చిన వినతిపత్రంలో ఆ సంగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లంకదాసరి శ్రీనివాస్, మహ్మద్ ఆఙ్ఘర్ ఖాన్ లు కోరారు. సోమవారం ఐ ఎం ఏ హాలులో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెళ్లిన వీరు వినతిపత్రం ఇచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపై దివ్యాంగులు దాదాపు 18 వేల వరకు ఉన్నారన్నారు. ఇలాంటి వారందరికీ ఈ పెన్షన్లు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. గతంలో క్రమం తప్పకుండా పెన్షన్లు రాగా ఈనెలలో 20 తేదీ వచ్చినా ఇప్పటికి పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాలో చాలామంది ఏ ఉపాధి లేక కేవలం ఈ పెన్షన్లపై ఆధారపడి ఉన్నారన్నారు. డి.ఆర్.డి.ఏ. అధికారులతో చర్చించి ప్రతినెలా 5 వ తేదీలోగా పెన్షన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాస్, ఆఙ్ఘర్ ఖాన్ లు కలెక్టరు ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరిశెట్టి చంద్రశేఖర్, నక్క లచ్చన్న లు ఉన్నారు.