జగిత్యాల ,జనవరి 24
ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య మహిళలకు ఎంత గానో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి అన్నారు.4 వ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ కుంగ్-ఫూ , కరాటే ఛాంపియన్షిప్-2022లో పాల్గొని బంగారు, రజత పథకాలు సాధించిన జగిత్యాల వీర కుంగ్-ఫు అకాడెమీ విద్యార్థులను జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ మహిళలకు ఆత్మ రక్షణ విద్య ప్రస్తుత పరిస్థితుల్లో చాల అవసరమని చెప్పారూ. కరాటేలో మగవారితో పాటు మహిళలను సమానంగా శిక్షణ ఇవ్వాలని శిక్షకులకు ఆమే సూచించారు. కరాటే,కుంగ్ ఫూలకు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. నైపుణ్యత కలిగిన విధ్యార్థులుగా తీర్చిదిద్దారని అందుకు శిక్షకులతో పాటు విధ్యార్థులను,పేరెంట్స్ ను ఛైర్ పర్సన్ శ్రావణి అభినందించారు. జగిత్యాలకు చెందిన 37 మంది విద్యార్థులు ఛాంపియన్ షిప్ లో 3 విభాగాల్లో పాల్గొంటే అందరు బంగారు,రజత పథకాలు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కుంగ్-ఫూ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా.భోగ.ప్రవీణ్ , గ్రాండ్ మాస్టర్ వీర చారి, చీఫ్ ఇన్ ష్ట్రాక్టర్ అబ్దుల్ ఖాదర్, మాస్టర్ వెంకటేశ్వర్లు, ఉస్మాన్, శేఖర్, నాయకులు అస్గర్ మొహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.