Home ఆంధ్రప్రదేశ్ విశాఖ, ఎండడా జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం 3టౌన్ సీఐ మృతి… కానిస్టేబుల్ పరిస్థితి విషమం

విశాఖ, ఎండడా జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం 3టౌన్ సీఐ మృతి… కానిస్టేబుల్ పరిస్థితి విషమం

208
0

విశాఖపట్నం
విశాఖ నగరంలోని ఎండడా జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3టౌన్ సీఐ  ఈశ్వరరావు మృతి చెందారు. డ్రైవర్ సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. అతనికి మెరుగైన వైద్యం కోసం గీతం హాస్పిటల్ కు తరలించారు. నైట్ రౌండ్స్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఎండాడ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ రావు, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్ సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు.ఘటన వివరాలు తెలియగానే విశాఖ నగర కమిషనర్ మానీష్ కుమార్ సిన్హా అక్కడకు చేరుకున్నారు. సీఐ ఈశ్వర రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎండాడ కూడలి వద్ద తెల్లవారి జామున సుమారు 3:30 సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని, ఇలా జరగడం చాలా బాధాకరం అని, ఇంకా రెండు సంవత్సరాలలో సీఐ ఈశ్వరరావు కు రిటైర్మెంట్ ఉండగా.. ఈలోగా ఇలా జరగడం కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతి కి లోనైయ్యేలా చేసిందని అన్నారు

Previous articleమల్లన్న హుండి లెక్కింపు
Next articleకిరాణా షాపులో చోరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here