మందమర్రి. సెప్టెంబర్ 21
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రాణహిత కాలనీలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ తరగతులను మంగళవారం సేవ అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మందమర్రి ఏరియాలోని మహిళలకు, యువతులకు అలాగే యువకులకు వృత్తి శిక్షణ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని దానిలో భాగంగా ప్రాణహిత కాలనీలో టైలరింగ్ కోర్స్ నేర్చుకుంటున్న మహిళలు చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి సంస్థ మహిళలు తమ కాళ్ల మీద వారు నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలని సేవా సమితి ద్వారా ఇలాంటి కోర్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వీరు తయారు చేసిన వాటిని వి హైదరాబాద్ శిల్పారామంలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో అలాగే మెహదీపట్నం లో స్టార్స్ ద్వారా విక్రయిస్తున్నారని దీని ద్వారా మహిళలు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ సేవ కోఆర్డినేటర్ ఆఫీసర్ సీనియర్ పి ఓ మైత్రేయ బంధు, కమ్యూనికేషన్ సేవా కోఆర్డినేటర్ నెల్సన్, సంపత్, శిక్షకురాలు రజిత, సేవా సభ్యులు పద్మ అభ్యర్థులు పాల్గొన్నారు.