Home వార్తలు మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

99
0

భోపాల్ అక్టోబర్ 1
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భీంద్‌ జిల్లాలోని వీర్‌ఖాది గ్రామం వ‌ద్ద బస్సు కంటైనర్‌లారీ ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మ‌రో 14 మంది గాయ‌పడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ‍ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఘటనాస్థలం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాలియర్‌లోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు గ్వాలియర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బరేలీపై పట్టణానికి ప్రయాణిస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మనోజ్ సింగ్ చెప్పారు.

Previous articleరాష్ట్రపతికి ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి జన్మదినం శుభాకాంక్షలు
Next articleహైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి 16 పేర్లను సూచించింన కొలీజియం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here