విజయవాడ
ఎయిడెడ్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగించాలంటూ ఎస్ఎఫ్ ఐ ఆందోళన కు దిగారు. మాంటిస్సోరి పాఠశాలలోపలకు వెళ్లేందుకు యత్నం చేసారు.వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్ది సంఘాల నేతలు నినాదాలు చేసారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బిషప్ హజరయ్య స్కూల్ సందర్శనకు వస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో దారుణంగా వ్యవహరిస్తుంది. తాంబూలాలు ఇచ్చాం. తన్నుకు చావండి అన్న విధంగా ప్రభుత్వం తీరు ఉంది. 42, 50 జీవోలను వెంటనే రద్దు చేసి ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా.. ఎయిడెడ్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగించే వరకు మా పోరాటం ఆపేది లేదని అన్నారు.