శ్రీనగర్ అక్టోబర్ 13
జమ్మూకశ్మీర్‌లోని అవంతిపొరా త్రాల్ ప్రాంతంలో తివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ ఎ మహ్మద్‌కు చెందిన టాప్ కమాండర్ షమ్ సోఫిని సంయుక్త బలగాలు హతమార్చాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవలే సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఐదుగురు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు మైనార్టీలైన హిందువులను, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణకాండ జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఉధృతం చేసింది. ఈ క్రమంలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి సహా ఐదుగురు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత మరింత ఉధృతం చేసింది. ఇటీవలే మొత్తం పది మంది ఉగ్రవాదులను హతమార్చింది.