నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 34 వ డివిజన్ అభివృద్ధి సంక్షేమానికి ఈ నెల 15న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక డివిజన్ వైకాపా అభ్యర్థిని షేక్ ఫామీదను ఆదరించి గెలిపించాలని, స్థానిక వైకాపా సీనియర్ నాయకులు షేక్. సంసుద్దీన్ పేర్కొన్నారు. స్థానిక ప్రగతి నగర్ 5వ వీధి తదితర ప్రాంతాలలో మంగళవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలోని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్. రియాజ్ సతీమణి షేక్. ఫామీద ఘన విజయం సాధించే దిశగా స్థానిక ఓటర్లు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ వైకాపా అభ్యర్థిని షేక్. పామీద మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని తన విజయానికి చేయూతనివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు స్థానిక డివిజన్ ఇంచార్జి షేక్ మస్తాన్ తదితరులు బలపరిచిన అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం హర్షనీయం అన్నారు. డివిజన్ పరిధి ప్రజలకు అధికారిక సేవలు అందించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్, అభ్యర్థిని భర్త షేక్ రియాజ్ మరియు స్థానిక డివిజన్ ఇంచార్జి షేక్ మస్తాన్, స్థానిక డివిజన్ వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ 34 వ డివిజన్ అభివృద్ధి సంక్షేమానికి షేక్. ఫామీదను గెలిపించాలి వైకాపా నేత షేక్. సంసుద్దీన్