తుగ్గలి
ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు తుగ్గలి ఎస్ఐ షామీర్ భాష తెలియజేశారు.వివరాల్లోకి వెళ్ళగా ఆదివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని రైల్వే బ్రిడ్జి సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తునటువంటి ట్రాక్టర్ ను సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేసినట్టు తుగ్గలి ఎస్ఐ తెలియజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.