నిజామాబాద్ సెప్టెంబర్ 30
బుధవారం నిజామాబాద్ నగరంలో వెలుగుచూసిన అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడు నవీన్‌తో పాటు భాను ప్రకాష్, కరీం, చంద్రశేఖర్, గంగాధర్, చరణ్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు గా సీపీ కార్తికేయ చెప్పారు.నిందితులపై అత్యాచార కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. బాధిత యువతికి స్నేహితుడు విజయ్ మొదటగా లోబర్చుకొని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం విజయ్ తన స్నేహితులకు సమాచారం అందించడంతో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించినట్లు సీపీ పేర్కొన్నారు.బాధిత యువతిని మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి కలవడానికి ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. బాధిత యువతి తో నిజామాబాద్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు అసభ్యకరంగా ప్రవర్తించారన్న విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అలాంటి ఘటన జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.