కాలిఫోర్నియా అక్టోబర్ 16
పాములు బాబోయ్ పాములు..ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 92 ర్యాటిల్ స్నేక్స్ ఓ ఇంట్లో తిష్ట వేశాయి. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కొన్ని పాములు ఇంట్లో దాక్కొని అక్కడే పిల్లలను కూడా పెట్టాయి. దీంతో ఆ పాములు మొత్తం 100కు అయ్యాయి. కొన్నిరోజుల తర్వాత ఇంట్లో పాములను గుర్తించిన ఇంటి యజమాని వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించాడు.వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. దాదాపు 4 గంటలు కష్టపడి ఇంట్లో నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. బయట పాములకు తిండి దొరకక.. అన్నీ ఒకేచోట నివాసం ఉంటున్నాయని రెస్క్యూ టీమ్ వెల్లడించింది.పాములను వెలికి తీశాక.. వాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని పాములు ఇంట్లో ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాం.. అని నెటిజన్లు కామెంట్లు చేశారు.