మంచిర్యాల
ప్రస్తుతం మనందరం వినియోగిస్తున్న ఇంధన, శక్తి వనరులైన బొగ్గు, పెట్రోలియం లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోలార్ శక్తిని వినియోగించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో టి.ఎస్. రెడ్-కో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పున;రుద్దరణ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ సౌజన్యంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 15 వేల మందికి పూర్తి ఉచితంగా సోలార్ స్టడీ ల్యాంప్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు సోలార్ స్టడీ ల్యాంప్‌లను వినియోగించడం ద్వారా వనరులను పొదుపు చేయవచ్చని, దాదాపు 450 రూపాయల విలువైన సోలార్ ల్యాంప్‌లకు ప్రభుత్వం ద్వారా 85 శాతం రాయితీ ఇవ్వడంతో ఒక్కొక్కటి “70 రూపాయల చొప్పున విద్యార్థులకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగిందని,
సీరియస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్- హైద్రాబాద్ వారు పూర్తి రాయితీ క్రింద 70 రూపాయలు కూడా వారు చెల్లించడం ద్వారా జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా సోలార్ ల్యాంప్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. మనం ప్రతి నిత్యం వినియోగించే శక్తి వనరులు తరిగిపోతున్నాయని, ప్రత్యామ్నాయంగా ఎన్నటికీ తరగని సోలార్ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థి దశ నుండే శక్తి వనరులు దుర్వినియోగం కాకుండా ప్రత్యామ్నాయ శక్తి వనరులు వినియోగించుకునే, పునరుద్ధరించుకునే విధంగా ఇంధన వనరుల వాడకంపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తరిగిపోతున్న శక్తి వనరుల ద్వారా ఉత్పన్నమయ్యే కాలుష్యం వలన కలుషిత వాతావరణం ఏర్పడుతుందని, విద్యార్థులు వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై స్పష్టత కలిగి ఉండాలని, ప్రతి దానిని తిరిగి వినియోంచుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు దిశగా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ల్యాంప్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, టి.ఎస్. రెడ్-కో జిల్లా మేనేజర్ వేణుగోపాల్, జిల్లా
సైన్స్ అధికారి మధుబాబు, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నా