నెల్లూరు
విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి సువర్ణ కుమారి ఆధ్వర్యంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కు ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక స్టోన్హౌస్పేట ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తాళ్లూరి సువర్ణ కుమారి మాట్లాడుతూ ఆర్యవైశ్య వర్గాలకే తలమానికంలా అంచెలంచెలుగా రాజకీయరంగంలో ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక దాటుకొని, నాయకుల అండదండలతో పాటు, ప్రజల ఆశీస్సులు మెండుగా పొందుతున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మరెన్నో నో ఉన్నతస్థాయి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముక్కాల ద్వారకానాథ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా తన వంతు తన ఆర్యవైశ్య వర్గంతో పాటు, సింహపురి ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యంగా, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వ ప్రతినిధిగా నుడా చైర్మన్ అవకాశం దక్కిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సింహపురి ప్రజల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.