తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి
తిరుమల,మా ప్రతినిధి ,అక్టోబర్ 02
జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈ రోజు తిరుమల పోలీస్ కాంప్లెక్స్ నందు జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు,మహాత్ముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగ పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని అందించి చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా, జాతిపితగా నిలిచారని కొనియాడారు. మహాత్మా గాంధీ చేసిన ఉద్యమాలు, సంస్కరణలు గుర్తుచేశారు. అలాంటి మహనీయుని ఆలోచనలు, సంస్కరణలు మన అందరికీ ఆదర్శప్రాయమని ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు సాగాలని భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొవచ్చిన మహాత్మ గాంధీజి ప్రపంచానికే ఆదర్శనీయమన్నరు
దేశ అభివృద్దికి గ్రామాలే పట్టుకొమ్మలు అనే గాంధీజి ఆశయాలతో గ్రామాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందీ.గాంధీజి గారి అడుగు జాడలను, అందించిన సేవలను మనమందరం ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలనీ తెలిపేరు. మానవ సేవయే – మాధవ సేవ అని తెలిపారు.
అక్టోబర్ 2 అంటే మహాత్మ గాంధీ గారి పుట్టిన రోజుగా మాత్రమే అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ అదే రోజు భరతమాత కన్న మరో మహా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా. ఏది ఏమైనా, మనం మరుపురాని రోజుగా గాంధీ జయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2న మన దేశానికి రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా. నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారత రెండవ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు.
కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా కొద్ది కాలం జీవించారు శాస్త్రిగారు. ప్రధానిగా కొంతకాలమే ఉన్న భారతీయ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రి తనదైన ముద్ర వేశారు. అదే ఆయన్ని ధృడమైన నాయకునిగా మన ముందు నిలబెట్టాయి.
1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా దేశానికి వెన్నుముకలైన రైతులను, సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన నినాదం ‘జై జవాన్..జై కిసాన్’ దేశాన్ని ఒక్కటి చేసింది.
పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించిన ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకునే లోపే ఆయన దేశం కోసం ప్రాణాలు విడిచారని యస్.పి అన్నారు.