Home ఆంధ్రప్రదేశ్ మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు గాంధీజీ మార్గం అనుసరణీయం ...

మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు గాంధీజీ మార్గం అనుసరణీయం మహాత్మా గాంధీజీ పుట్టిన రోజు సందర్భంగా ప్లాస్టిక్ హటావో….కర్నూల్ బచావో కార్యక్రమం శ్రీకారం జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు

151
0

కర్నూలు, అక్టోబర్ 02

జాతిపిత మహాత్మ గాంధీ చూపిన మార్గాన్ని మనమందరం అనుసరించాలని జిల్లా కలెక్టరు పి. కోటేశ్వర రావు అన్నారు.

శనివారం కలెక్టరేట్ సమీపంలోని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మహాత్మ గాంధీ విగ్రహనికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ, డి ఆర్ ఓ పుల్లయ్య, వి రామ్ గోపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ వై రామేశ్వర్ రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని గాంధీ విగ్రహం దగ్గర మహాత్మాగాంధీ, చాచా నెహ్రూజి వివిధ దేశ నాయకుల వేషధారణలో ఉన్న పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డిలు కలిసి ఫోటోలు దిగి వారితో ముచ్చటించారు.

అనంతరం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం సమీపంలో కర్నూల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 75 స్వతంత్ర భారత మహోత్సవాలులో భాగంగా జగనన్న స్వచ్చ సంకల్పం ప్లాస్టిక్ హటావో….కర్నూల్ బచావో అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ బాటిల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాధ్యతగా ప్లాస్టిక్ బాటిల్ వ్యర్థాలకు సంబంధించిన వాటిని మున్సిపల్ కార్మికులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లా కలెక్టర్ బాధ్యతగా ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి మున్సిపల్ కార్మికులకు అందజేయడంతో కర్నూల్ మున్సిపాలిటీ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు సర్టిఫికెట్ అందజేశారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ… భారతదేశ స్వాతంత్ర్యానికి పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీజీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. సత్యం, అహింస గాంధీజీ నమ్మే సిద్ధాంతలు అయితే, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు అన్నారు. మహాత్మా గాంధీజీ గారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను మాటల్లో చెప్పుకోవడం కాకుండా, ప్రతి పౌరుడు ఆచరణలో పెడితే గాంధీజీ కలలు కన్న మన రాజ్యాన్ని నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే కర్నూలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ హటావో-కర్నూల్ బచావో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన కర్నూలు నగరాన్ని గాంధీ జయంతి రోజున ఉత్తేజితం చేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చి ఇక్కడికొచ్చి మున్సిపాలిటీకు ఇస్తే వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో మరింత బాధ్యత పెరిగి వారికి ప్రోత్సహించిన వారమవుతాము అని వినూత్నంగా చేస్తున్నామన్నారు. ఈ రోజు గాంధీ జయంతి పుట్టిన రోజు సందర్భంగా ప్లాస్టిక్ వాడకం మరియు ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని వీలైనంత తగ్గించే క్రమంలో కర్నూలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత కర్నూలును శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

Previous articleఇంటింటికీ మొక్క- ఊరంతా వనమవ్వాలి జి ఓ ,ఎన్ జి ఓ నోడల్ అధికారి మహేంద్ర రెడ్డి
Next articleనగదు స్వాధీనాలు షురూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here