ఒంగోలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా శనివారం ఒంగోలు లోని గాంధీరోడ్డు లో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం నకు పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు గాంధీజీ స్వాతంత్ర పోరాటం గురించి గాంధీజీ ని గొప్పగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, రాష్ట్ర మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, ఎమ్మెల్యే సుధాకర్ బాబు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఎఎంసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.