బద్వేలు
ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం కలసపాడు మండలం రామాపురం గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బిజెపి నాయకులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ అభ్యర్థి పనతల సురేష్ తదితర నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు.