Home వార్తలు డిసెంబర్ 1న విడుదల కానున్న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్ టీజర్

డిసెంబర్ 1న విడుదల కానున్న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్ టీజర్

240
0

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. లడ్డుండా పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాటను రెడీ చేశారు. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు రెండో పాట ‘నా కోసం’  టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలపై రొమాంటిక్ సన్నివేశాలు  ఈ పాటలో కనిపించబోతోన్నాయి. అనూప్ రూబెన్స్ అందమైన బాణీని సమకూర్చారు. మొదటిసారిగా నాగ చైతన్య, క‌ృతి శెట్టి జోడిగా కనిపించబోతోన్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అనూప్ రూబెన్స్ మంచి పాటలను అందించనున్నారు. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో  కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’  చిత్రంలో ఈ ఇద్దరూ మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.  నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

Previous articleవిడుద‌ల‌కు సిద్ద‌మైన హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానసాగర్ ద్వార‌క‌, వర్గో పిక్చర్స్ `సెహ‌రి`.
Next articleశ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి పట్టువస్త్రాల సమర్పణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here