Home ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ లో ఎస్పీ పర్యటన..

ఏజెన్సీ లో ఎస్పీ పర్యటన..

377
0

కుక్కునూరు, అక్టోబర్ 03
పశ్చిమగోదావరి కుక్కునూరు మండలంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యటన  చేశారు. పర్యాటనలో భాగంగా కుక్కునూరు పోలీస్ స్టేషన్లలో ఎస్పీ చేతుల మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేశారు. అనంతరం కుక్కునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో గిరి నేస్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి చేరుకున్నజిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సి,ఎస్టీ లకు చెందిన 100 మంది విద్యార్థులకు ఎస్పీ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణి చేశారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశా యాప్ ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కుక్కునూరు డివిజన్ అసిస్టెంట్ కలెక్టర్  రాహుల్ రెడ్డి మరియు పోలవరం డిఎస్పీ  లతాకుమారి చేతుల మీదుగా  ఆవిష్కరించారు. అనంతరం మహిళలకు దిశా యాప్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..విద్యార్థిని,విద్యార్థులు అందరూ గిరిజన నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని ఉన్నత స్థాయిలో వెళ్లాలని ఆకాంక్షించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు దిశా యాప్ చక్కగా ఉపయోగపడుతుందని,  మహిళలందరూ స్మార్ట్ ఫోన్ లో దిశా యాప్ ఇంస్టాల్ చేసుకొని ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరుతుందని వెంటనే పోలీస్ సిబ్బంది వచ్చి కాపాడాటానికి ఉపయోగపడుతుందన్నారు. కుక్కునూరు మండలంలో మావోయిస్టుల పేరిట వెలిసిన లేఖలు కేసును చాకచక్యంగా ఛేదించినందుకు కుక్కునూరు ఎస్సై శ్రీనివాసరావును ఎస్పీ ప్రశంస పత్రం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  రాహుల్ దేవ్ శర్మ ,పోలవరం డిఎస్పీ లతాకుమారి, కుక్కునూరు డివిజన్ అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి , కుక్కునూరు సిఐ దుర్గా ప్రసాద్, పోలవరం  సిఐ నరసింహ మూర్తి , పొలీస్ సిబ్బంది, కుక్కునూరు వైఎస్సార్ సీపీ నాయకులు, టిడిపి నాయకులు, బిజెపి నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleసమస్యలకు సత్వర పరిష్కారం
Next articleద‌ర్శ‌న టికెట్లు ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి – కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here