విజయవాడ
విజయవాడలో ఎస్ఈబీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం. 8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం. 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశామని అన్నారు.
హెరాయిన్ కేసుపై మరోసారి సీపీ క్లారిటీ
గుజరాత్ హెరాయిన్ కేసుకు విజయవాడకు సంబంధం లేదు. డ్రాగ్ రాకెట్ ఢిల్లీ కేంద్ర కార్యకలాపాలు జరిపింది. విజయవాడ అడ్రస్ ను 2 సార్లు ఉపయోగించారు. నగరంలో రౌడిసీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. 18 మంది రౌడీ షీటర్స్ లను నగర బహిష్కరణ చేశామని అన్నారు. 116 మందిపై కొత్తగా షీట్స్ ఓపెన్ చేశాం. 3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టాం. కొండపల్లి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.