Home ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ జెండర్స్ అందరి తో సమానం గౌరవం గా జీవించేందుకు ప్రత్యేక ఉపాధి శిక్షణ ...

ట్రాన్స్ జెండర్స్ అందరి తో సమానం గౌరవం గా జీవించేందుకు ప్రత్యేక ఉపాధి శిక్షణ ఎం పి మద్దిల గురుమూర్తి

175
0

తిరుపతి

తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి శనివారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్స్ సమస్యలు పై వారి తో సమావేశమయ్యారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో రేషన్,ఆరోగ్య శ్రీ కార్డ్స్ లేవని ఇప్పడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రేషన్,ఆరోగ్యశ్రీ కార్డ్స్ మంజూరు చేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక 43 మంది కి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు.  అలాగే తమకు అందరికి ఒకే చోట జగనన్న కాలనీ ల్లో ఇళ్లను కేటాయించాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కడప,చిత్తూరులల్లో ట్రాన్స్ జెండర్స్ కె ప్రత్యేకంగా ఇళ్లు ఇచ్చారని, దీని వల్ల ఏదైనా సమస్య పై మాట్లాడుకోవలన్న అందరూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ విషయం పై అప్పటికప్పుడే ఎం పి మద్దిల గురుమూర్తి ఈ సమస్య పై అధి కారుల తో మాట్లాడారు.
ట్రాన్స్ జెండర్స్ కి ప్రత్యేకంగా ఉపాధి శిక్షణ చేపడతామన్నారు.  సమాజంలో అన్నివర్గాల తో సమానంగా గౌరవం గా జీవించేందుకు వీలుగా  ఉపాధి శిక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. ” ట్రాన్స్ జెండర్స్ మాట్లాడుతూ సార్ మీరు దేవుడు లాగా మమ్మల్ని పిలిపించుకుని మా సమస్యలు కనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, దేవుడే మీ రూపంలో మా దగ్గరకు వచ్చినట్లు ఉందన్నారు. ఇల్లాస్థాలు, డ్రైవింగ్ శిక్షణ కు అధికారుల తో మాట్లాడతమన్నారు. భిక్షాటన చేసి బతకాలని మాకు లేదు సార్, డ్రైవింగ్ నేర్పించి, సబ్సిడీ లో కారులు కొనుగోలుకు రుణాలు ఇస్తే అందరి లాగే గౌరవం గా బతుకుతామన్నారు. అలాగే మాకు ప్రత్యేకంగా గుడి కట్టుకుని పూజలు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు.

Previous articleమావోయిస్టు పామావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి ఏడాదిన్నర తరువాత ప్రకటించిన మావోయిస్టు పార్టీర్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి ఏడాదిన్నర తరువాత ప్రకటించిన మావోయిస్టు పార్టీ
Next articleఈసీజీ తీయాలని దుస్తులు విప్పాదీసిన ల్యాబ్ టెక్నీషియన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here