కడప సెప్టెంబర్22
కడప నగరం లోని వైసిపి సీనియర్ నేత ఆర్. మాసీమ బాబు గారికి టిటిడి బోర్డ్ మెంబర్ గా పదవి అలంకరించిన పెద్దాయనకు 48 డివిజన్ కృపా కాలనీకి చెందిన న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్ అధ్యక్షతన మరియు బేడ బుడగజంగం రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీరాములయ్య, టి.కొండయ్య పాల్గొని శాలువా పూల మాలలతో సన్మానించారు. పాస్టర్ పి.మహేష్ ప్రార్థనలు చేసి యేసు క్రీస్తు ఆశీస్సులు మెండుగా వుండాలని కోరుకుంటు వారు మాట్లాడుతూ పట్టణంలో కుల మత బేధం లేక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వున్న మాసీమ బాబు గారికి టిటిడి బోర్డ్ మెంబర్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి, ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్ పి. రవితేజ, రోజా, పి. శాంతిరాజు పాల్గొన్నారు.