మహబూబ్ నగర్, నవంబర్ 16
“విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ” ద్వారా “స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు.
. కరోన సమయంలో, హైదరాబాద్
నగరంలో గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో అందించిన సేవలకు గాను మరియు గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నటువంటి అపారమైన సేవలను గుర్తించిన “విశ్వ గురు
అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ” సుధీర్ రెడ్డి కి “అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మరియు సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్
రమాకాంత్, ఎం ఆర్ డి సి ఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు