నందికొట్కూరు నవంబర్ 05
బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 1989 విద్యాసంవత్సరం లో 10వ తరగతి చదివిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 7న ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు వెంకటేశ్వర రెడ్డి, పుల్లన్న లు ఒక ప్రకటన లో తెలిపారు.శుక్రవారం వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వపు విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పూర్వపు ఉపాద్యాయులు హాజరవుతారన్నారు.సమ్మేళనానికి ప్రతి పూర్వపు విద్యార్ధి హాజరు కావాలని పిలుపునిచ్చారు.