కడప, సెప్టెంబర్ 19
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఆలయం వద్దకు చేరుకోగానే మేళతాళాలు, మంగళవాయిద్యాలతో అర్చకులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి, శ్రీవారికి అర్చనచేసి పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా రావాలని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని ప్రార్థించామన్నారు.