శ్రీకాళహస్తి
నాడు కరోనా, నేడు జవాద్ తుఫాన్ కారణం గా శ్రీకాళహస్తిశ్వరాలయం లో భక్తులు లేక బోసిపోయింది. సాధారణం గా శని, ఆది, సోమ, మంగళ వారాలలో ఆలయం భక్తుల తో కిటకిట లాడుతుంది. కార్తీక మాసం లో నిత్యం రద్దీ తో కనిపించే శివాలయాలను గత వారం రోజులు గా జవాద్ తుఫాన్ అతలాకూతలం చేసింది.. శ్రీకాళహస్తిశ్వరాలయానికి భక్తులు రాక ప్రశ్నార్థకం గా మారింది. శ్రీకాళహస్తి ఆలయం కు భక్తులు తమిళ నాడు . కర్ణాటక .తెలంగాణ నుంచి ఎక్కువగా రాహుకేతు పూజలు నిర్వహించు కునేందుకు తండోపతండాలుగా వస్తుంటారు. చెన్నై నగరం లో విపరీతం గా వర్షాలు కురవడం తో అక్కడ ప్రజలు ఇంటి నుండి బయట కు రావడం లేదు. దాంతో నిత్యం రద్దీ గా ఉండే శ్రీకాళహస్తిశ్వరాయం భక్తులు లేక బోసి పోయింది