శ్రీశైలం
24వ తేదీన
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం లో ఈరోజు మల్లికార్జున స్వామి వారి భక్తులు స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన భార్య భర్తలు లో భర్తకి గుండెపోటు రావడంతో అతనిని హుటాహుటిన శ్రీశైల దేవస్థానం ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందిస్తుండగా ఆ భక్తుడు అప్పటికే మరణించాడని డాక్టరు చెప్పడం జరిగింది. మృతుడు గద్వాల జిల్లా నాగర్ దొడ్డి పల్లెకు చెందిన గంధం జయన్న భార్య పద్మ భర్త మరణవార్త విని బోరున కన్నీరు మున్నీరుగా విలపించింది శ్రీశైల దేవస్థానం ఆసుపత్రిలో శోకసముద్ర రాలు అయినది వీళ్లకు మూడు నెలల చిన్నారి జయశ్రీ పాప ఉంది చిన్నారి పాప ను కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకొని గుడికి దర్శనార్థమై వెళుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు మృతుని కుటుంబానికి ప్రభుత్వం వారు మూడు నెలల చిన్నారి జయశ్రీ కి సహాయం చేయగలరని ఆమె విన్నవించుకున్న ది.మృతుని ఆయన భార్యను పాప జయశ్రీ ని దేవస్థానం ఆంబులెన్స్ లో వాళ్ల ఊరైన నాగర్ దొడ్డికి తరలించడం జరిగింది.