Home ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం కోసం పడిగాపులు ” పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్యలు

రేషన్ బియ్యం కోసం పడిగాపులు ” పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్యలు

89
0

పత్తికొండ
పత్తికొండ మండల పరిధిలోని చందోలి గ్రామం లోని ప్రజలు రేషన్ బియ్యం కొరకు మధ్యాహ్నం నుండి రాత్రి దాదాపు తొమ్మిది వరకు వేచి  చూడవలసి వస్తుంది . కూలి పని చేసుకునే రైతులు రోజుల తరబడి రేషన్ బియ్యం కోసం పొలం పనులు వదులుకొని పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడిందని , డీలర్ కు వివరణ అడగగా,ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేసి  రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని డీలర్లు ప్రశ్నించారు. సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం ,గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.వృద్దులు,మహిళలు,వికలాంగులు రేషన్ దుకాణాల వద్ద చాల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సరి అయిన సమయంలో ప్రజలందరికీ రేషన్ బియ్యం అందించవలసినదిగా గ్రామ ప్రజలు అందరూ కోరుతున్నారు

Previous articleరేషన్ పంపిణిలో సర్వర్ సమస్యను పరిష్కరించండి నందికొట్కూరు. సెప్టెంబర్ 22
Next articleనెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీనీ సందర్శించిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here