Home ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ప్రకటనలకే పరిమితం అయిన జగన్ ప్రభుత్వం

పాఠ్యపుస్తకాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ప్రకటనలకే పరిమితం అయిన జగన్ ప్రభుత్వం

107
0

పి డి ఎస్ యు

ఎమ్మిగనూరు న్యూస్ పట్టణంలో జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాల్లోని వెంటనే పంపిణీ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) తాలూక అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు, పట్టణ అధ్యక్షుడు సమీర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక పట్టణంలో రెవెన్యూ కార్యాలయం లో ఎంఆర్ఓ జయన్న గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ, సమీర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆది దశలోనే ఆచరణకు నొచకోవడం వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం జగన్ రెడ్డి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అద్దాలమేడ లాగా తయారు చేస్తానని ప్రకటనలకే పరిమితం అయితే జిల్లాలో నాడు నేడు పనులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగనన్న కిట్టు ఇప్పటికే చాలా మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నాడు నేడు అవినీతిపై సిబిసిఐడి తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్53,54 లో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కావున పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు నరసింహ రెడ్డి,జావీద్, భీమా, అశోక్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Previous articleకిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు సైనికులకు ఘనంగా సన్మానం రైతన్న అభివృద్ధి, సైనిక రక్షణ మోడీ ద్యెయం.
Next articleరైతులకు అందుబాటులో లేని రైతు భరోసా కేంద్రాలు అయోమయంలో రైతులు ప్రైవేటు వ్యక్తుల నుండి ఎరువులను కొనుగోలు చేస్తున్న రైతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here