విశాఖపట్నం
ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏవోబీలో దశా బ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సా గుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మో పుతోంది.ఏవోబీలో యథేచ్ఛగా నడు స్తున్న గంజాయి సాగును నామరూపా ల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్లోకి దించింది.ఏ జన్సీ మారుమూల ప్రాంతాల్లో గంజా యి దందాను కట్టడి చేసేందుకు పోలీ సు శాఖ ఆపరేషన్ పరివర్తన్ ను చేప ట్టింది.గంజాయి దుష్పరిణామాలపై గి రిజనులకు అవగాహన కల్పిస్తూ.. టె క్నాలజీ సాయం, భారీ స్థాయిలో బల గాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహి స్తోంది. రంగంలోకి దిగిన బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో రోజులుగా భారీ గా గంజాయి సాగును ధ్వంసం చేస్తు న్నాయి.అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది.