కోరుట్ల నవంబర్18(
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలు ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపడుతున్న కర్షకొండ ధర్నాకు మద్దతుగా మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులతో ధాన్యం కొనుగోలుపై ఎలా ఆటలాడుతున్నారో ఇందుకు రైతుల పక్షాన నిరసనగా దీక్ష చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనే వరకు రైతుల పక్షాన ఉద్యమం ఆపేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వీర్లలో ఎవరన్నా ఒక్కరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఏదైతే కేరళలో పార్టీ బలోపేతం చేశారో అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసి పార్టీ బలోపేతం చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా, కాంగ్రెస్ నాయకులు కటకం గంగారెడ్డి, కొమ్ముల రాజిరెడ్డి, అజీమ్, పెంట ప్రణయ్, బర్ల వంశీ, మహమ్మద్ రైసొద్దీన్, రజాక్, బర్ల అర్జున్, పల్లికొండ ప్రవీణ్, కంతి హరికుమార్, వంగ వేణు, రుక్మొద్దీన్, ఎండి షరీఫోద్దీన్, మురళి కృష్ణ, ఎండి.మొయిన్ తదితరులు పాల్గొన్నారు.