రాజన్న సిరిసిల్ల
జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు మరియు వాటిని సప్లై చేసే వ్యక్తుల పై, గంజాయి సాగు చేసే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని,గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నియంత్రించే మార్గాలపై అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని,జిల్లాలో గంజాయి కట్టడకి పోలీస్ అధికారులు తీసుకుంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ పైన గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షనిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నిర్మూలించడమే ద్యేయంగా ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అందుకు అనుగుణంగా జిల్లా పోలీసు అధికారులు అందరూ గంజాయి అక్రమ రవాణాను నిరోధించి నేరస్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు..గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను నియంత్రణలో పూర్తిస్థాయిలో సమూలంగా నియంత్రించాలని తెలిపారు… మారుమూల ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి, పత్తి సాగు తో పాటు గంజాయిని సాగు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిపై నా ఎక్కువగా ఫోకస్ చేయాలని సూచించారు.గంజాయి సేవించేవారు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుంటున్నారని వారి యొక్క కదలికలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సేవించే వారి యొక్క డేటా ను కలెక్ట్ చేసి వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని మరల అదే విధంగా చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడంతో పాటు, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందని. గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పతిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారూ.గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో రివార్డు తగిన పారితోషకం మరియు మంచి గుర్తింపు లభిస్తుందని మరియు ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు..గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు వారికి నగదు పురస్కారంఅందజేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు..ఈ సమావేశంలో డిఎస్పీ లు చంద్రశేఖర్ చంద్రకాంత్, ,రవికూమార్ ,సి.ఐ లు అనిలకుమార్,ఉపేందర్,మోగిలి,వెం