Home తెలంగాణ గంజాయి విక్రయించిన ,రవాణా చేసిన కఠిన చర్యలు మెట్ పెల్లి డీఎస్పీ...

గంజాయి విక్రయించిన ,రవాణా చేసిన కఠిన చర్యలు మెట్ పెల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు 1కేజీ 05 గ్రాములు ఎండు గంజాయి స్వాధీనం

303
0

జగిత్యాల అక్టోబర్ 25
అక్రమంగా గంజాయి విక్రయించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని ,మెట్ పెల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా లోని మేడిపల్లి మండలంలోని పోరుమల్ల గ్రామ శివారు జోగిన్ పల్లి వెళ్లే దారిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని పక్క సమాచారం మేరకు మేడిపెల్లి ఎస్సైసుధీర్ రావు, కోరుట్ల ఎస్సై సతీష్ లు సంయుక్తంగా రోడ్డు వెంబడి సోదాలు నిర్వహించగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 04 గురు వ్యక్తులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
సోమవారం డీఎస్పీ కోరుట్ల పోలీసులు స్టేషన్ లో
సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు సతీష్ , సుధీర్ రావు లతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ
సింధు శర్మ ఆదేశాల మేరకు మెట్ పెల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి సూచన మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు కోరుట్ల ఎస్సైసతీష్ లభించిన సమాచారం మేరకు
ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో
మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు ,కోరుట్ల ఎస్సై సతీష్
తోపాటు ట్రైని ఎస్సైలు నినిషా రెడ్డి, సురేష్, రజిత లు తమ సిబ్బంది అనిల్ కుమార్ ,అజీమ్, సంపత్, గంగాధర్ లతో కలిసి మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామ శివారు జోగినిపల్లి వెళ్లే రహదారిలో సోదాలు నిర్వహించగా అనుమానాస్ప స్థితిలో 2 స్కూటీ మోటార్ సైకిళ్ల పై నలుగురు వ్యక్తులను మడావి మాణిక్ రావు (57),బొల్లె విష్ణు (20),బంగారు తరుణ్ (21),సిద్దె సుభాష్ (19)లను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి 1కేజీ 05 గ్రాములు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారని , అందులో మాడాడి మాణిక్యరావు వయసు (57)  నాగపూర్, దంతన్ పల్లి గ్రామం, ఉట్నూర్ మండలం, అదిలాబాద్, జిల్లా బొల్లె విష్ణు (20)  కుమార్ పల్లి గ్రామం, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా, బంగారు తరుణ్  (21) జోగిన్ పల్లి గ్రామం, కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా, సిద్దె సుభాష్ (19) జోగిన్ పల్లి గ్రామం, కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా, వీరు నలుగురిని  పోలీసుల ఆధ్వర్యంలో మేడిపల్లి మండల తాహసిల్దార్ బషీర్ ఎదుట స్వాధీనం చేసుకున్న ఒక కేజీ 5 గ్రాముల ఎండు గంజాయి మరియు నలుగురు వ్యక్తులను హాజరు పరిచి పంచనామా చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
మాడావి మాణిక్యరావు తన గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో పండిస్తున్న గంజాయి పంటను సైతం అధికారికంగా ధ్వంసం చేసినట్లు,
ఇట్టి కేసు విచారణలో సదరు మాణిక్యరావు తన గ్రామం నాగపూర్, దంతన్ పల్లి ,ఉట్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, శివారు నందు తన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో సుమారు ఐదు సంవత్సరాల నుండి గంజాయి సాగు చేస్తూ అట్టి గంజాయిని ఎండబెట్టి చుట్టుపక్కల గ్రామాలు, వివిధ జిల్లాల యువకులకు విక్రయించి జీవనం సాగిస్తున్నాడని , ఈ క్రమంలో మాణిక్యరావు గతంలో జగిత్యాలలో ఉండి ప్రస్తుతం కడెం మండలం, బెల్లాల్ గ్రామంలో ఉంటున్న వరుణ్ తో పరిచయమై గంజాయికి బానిస చివరకు తాను కూడా గంజాయి వ్యాపారంలో దిగాడు , అదేవిధంగా కాలక్రమంలో తరుణ్ సన్నిహితులైన బొల్లె విష్ణు, బంగారు తరుణ్, సిద్దె సుభాష్ లు కూడా ఈ గంజాయి కూపంలోకి దిగి వ్యసనానికి బానిస చివరకు తమ స్నేహితులతో గంజాయి అమ్మటం మొదలు పెట్టారు. ఈ విధంగా గత రెండు సంవత్సరాలుగా జరిగిన గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన  కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై  సుధీర్ రావు, కోరుట్ల ఎస్సై సతీష్, మేడిపల్లి పోలీస్ సిబ్బంది అనిల్ కుమార్, అజీమ్, కోరుట్ల సిబ్బంది సంపత్ ,గంగాధర్ లను జిల్లా ఎస్పీ  సింధు శర్మ, మెట్ పెల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. గంజాయి పండించినా, కలిగి ఉన్నా ,సేవించిన రవాణా చేసిన, చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా చూసుకోవాలని ఏమైనా అనుమానం వస్తే తమకు సమాచారం ఇస్తే తగిన కౌన్సెలింగ్ ఇస్తామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.

Previous articleమహిళా సంక్షేమానికి పెద్ద పీట
Next articleబాలింత మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here